TGPSC Group 4 Certificate Verification List Released

TGPSC Group 4 Certificate Verification List Released – Download Here Directly

TGPSC Group 4 Certificate Verification List Released: తెలంగాణ గ్రూప్‌-4 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జాబితాను టీజీపీఎస్సీ ఆదివారం (జూన్‌ 9) విడుదల చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచిన TGPSC తన ప్రకటనలో పేర్కొంది. వెబ్‌ ఆప్షన్లతోపాటు లోకల్‌, అన్‌ రిజర్వ్‌డ్‌ క్యాటగిరీల వారీగా వివరాలు పొందుపరిచినట్టు తెలిపింది. షార్ట్‌ లిస్టైన అభ్యర్ధుల వివరాలను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఎంపికైన అభ్యర్ధులు చెక్ లిస్ట్‌తోపాటు 2 కాపీలు అప్లికేషన్‌ ఫాం, అటెస్టేషన్‌ కాపీలు రెండేసి చొప్పున డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. వీటితోపాటు సంబంధిత అన్ని సర్టిఫికెట్లను తీసుకుని సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని టీజీపీఎస్సీ పేర్కొంది.

నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంతోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్టు కమిషన్‌ తెలిపింది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థులకు వెబ్‌ ఆప్షన్ల లింక్‌ జూన్‌ 13 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యే ముందు అభ్యర్ధులు తప్పనిసరిగా వెబ్‌ అప్షన్లు ఇచ్చుకోవాలని, వెబ్‌ అప్షన్లు నమోదు చేసుకున్న వారిని మాత్రమే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు అనుమతిస్తామని తన ప్రకటనలో కమిషన్‌ వివరించింది.

తెలంగాణ గ్రూప్‌-4 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Balmer Lawrie Recruitment 2024 – Junior Officer Posts