Health Benefits Of Eating Mushrooms Regularly

పుట్టగొడుగులతో 5 ప్రత్యేక లాభాలు.. తెలిస్తే చికెన్ బదులు ఇవే తింటారు

Health Benefits Of Mushrooms: పప్పులు, గింజలు, గుడ్ల వంటి ఆహారం ఎప్పుడూ తినేదే. పుట్టగొడుగులు మాత్రం చాలా తక్కువ మంది వండుకుంటారు. అందుకు కారణం వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలియకపోవడమే. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ పుట్టగొడుగుల వాడకం పెరిగేలా చేస్తున్నాయి. గడ్డిలో పెరిగే.. ఆ చిన్ని వింత గొడుగు ఆకారంలోని మొక్కలే.. ఇప్పుడు ప్రపంచానికి సంజీవనిలా మారుతున్నాయి.

నిజానికి అవి మొక్కలు కావు. అవి ఓ రకమైన ఫంగస్. చూడటానికి మాత్రం గొడుగుల్లా ఉంటాయి. తోటల్లో, అడవుల్లో, చెట్ల కాండాలపై ఇవి పెరుగుతూ ఉంటాయి. అవి మిగతా మొక్కల లాంటివి కాకపోవడంతో.. మనం వాటిని తినే విషయంలో డౌట్ పడతాం. ధర ఎక్కువగా ఉంటాయని కూడా చాలా మంది వాటిని తినరు.

సూర్యకాంతితో పనిలేకుండా పెరిగే మష్రూమ్స్.. నిండా పోషకాలతో ఉంటాయి. ఇవి తమ ఆహారాన్ని తాము తయారుచేసుకోలేవు. కానీ.. తమకు కావాల్సిన పోషకాల్ని అవి.. చనిపోయిన మొక్కలు, జీవుల నుంచి సంగ్రహించుకుంటాయి. మరి వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

Cancer-fighting properties:
ప్రపంచానికి పెను సవాలుగా మారిన క్యాన్సర్ నివారణలో పుట్టగొడుగులు బాగా పనిచేస్తున్నాయి. మైటేక్, క్రిమినీ, పోర్టాబెల్లా, ఓయస్టర్, వైట్ బటన్ వంటి రకాల పుట్టగొడుగులు… బ్రెస్ట్ కాన్సర్‌ను తగ్గిస్తున్నాయి. బాడీలో కొత్త కణాలు పెరిగేలా చేస్తున్నాయి. వాటిలోని లెంటినాన్ అనే షుగర్ మాలిక్యూల్.. క్యాన్సర్ పేషెంట్లకు ప్రాణం పోస్తోంది.

Immunity-boosters:
పుట్టగొడుగుల్లోని లెంటినాన్.. మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే.. వీటిలోని బీటా గ్లుకాన్ అనే చక్కెర పదార్థం కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది. మనం రెగ్యులర్‌గా వాడే మష్రూమ్‌లలో కూడా ఇవి ఉంటాయి.

Help lower cholesterol:
అధిక బరువుతో బాధపడేవారు.. పుట్టగొడుగులు తింటే మేలు. ఇవి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తరిమేస్తాయి. ఇందుకోసం లివర్ బాగా పనిచేసేలా చేస్తాయి. లివర్.. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తీసేస్తుంది. అందువల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. బీపీ పేషెంట్లకు పుట్టగొడుగులు ఎంతో ప్రయోజనకరం.

High in B and D vitamins:
బాడీలో కొవ్వును కరిగించే D విటమిన్ పుట్టగొడుగుల్లో ఉంటుంది. బటన్, క్రిమినిస్ పుట్టగొడుగుల్లో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. క్రిమినిస్‌లో విటమిన్ B12 కూడా ఉంటుంది. మాంసాహారం తిననివారు.. క్రిమినిస్ పుట్టగొడుగులు తినడం మేలు. మనం తిన్న ఆహారం ఎనర్జీగా మారాలంటే.. మనకు B విటమిన్ అవసరం. అందుకే పుట్టగొడుగులను వారానికి రెండుసార్లైనా తినాలంటారు.

Help fight aging:
పుట్టగొడుగుల్లో ఎర్గోథియనీన్, గ్లుటాథియోన్ అనే రెండు యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. అవి.. మన శరీరంలో చెడు కణాలను తొలగిస్తాయి. అలాగే శరీరానికి బయటి నుంచి వచ్చే వైరస్, బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి. తద్వారా మనకు త్వరగా ముసలితనం రాకుండా చేస్తాయి. ఈ కారణంగానే ఇప్పుడు విదేశీయులు పుట్టగొడుగులను డైలీ ఫుడ్‌గా తీసుకుంటున్నారు. ఇవి కాస్త రేటు ఎక్కువ కాబట్టి.. మన దేశంలో వారానికి ఒకసారి తింటున్నారు. ఆరోగ్య నిపుణులు మాత్రం.. పుట్టగొడుగులను రెగ్యులర్ ఫుడ్‌లా తినాలని సూచిస్తున్నారు.