Pm To Launch Mangalagiri Aiims In Ap

నేడు మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం.. ప్రధాని మోదీ వర్చువల్ కార్యక్రమం

Pm To Launch Mangalagiri Aiims In Ap:ఆంధ్రప్రదేశ్.. మంగళగిరిలో సిద్ధమైన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. అలాగే.. రాజ్‌కోట, రాయ్‌బరేలీ, భటిండా, కల్యాణీ ఎయిమ్స్‌ని కూడా మోదీ జాతికి అంకితం చేస్తారు. ఇంకా 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే విశాఖలో మైక్రో బయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాప్ సహా నాలుగు మొబైల్ ఫుడ్ టెస్టింగ్వ ల్యాబ్ లను కూడా మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులూ పాల్గొంటారు.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కేంద్రం ఈ ఎయిమ్స్‌ని నిర్మించిందని అనుకోలేం. దీని ద్వారా ఎన్నికల మైలేజీ పొందాలి అనుకుంటే, ప్రధాని మోదీ స్వయంగా వచ్చి దీన్ని ప్రారంభించేవారే. కేంద్రం ఇలాంటి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేస్తూనే ఉన్నా, వాటిపై పెద్దగా ప్రచారం చేసుకోవట్లేదు. ఇక మంగళగిరి ఎయిమ్స్ సంగతి చూస్తే, దీని కోసం గత టీడీపీ ప్రభుత్వం మంగళగిరి దగ్గర్లో 183 ఎకరాలు ఇచ్చింది. కేంద్రం రూ.1,618 కోట్లతో ఎయిమ్స్‌ని నిర్మించింది. ఇందులో మెడికల్ కాలేజీ, మెడికల్ ల్యాబ్, నర్సింగ్ కాలేజీ, ఆపరేషన్ థియేటర్లు, ఇన్ పేషెంట్, ఎమర్జెన్సీ సేవలు, రెసిడెన్షియల్ బ్లాక్, గెస్ట్ హౌస్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఇంటెగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నాయి. మొత్తం 960 పడకలతో ఆస్పత్రి ఉంది.

Central Silk Board Recruitment 2024– Apply for 122 Scientist Posts

నిజానికి 2019 మార్చి నుంచే ఇక్కడ రోగులకు సేవలు అందుతున్నాయి. రోజూ దాదాపు 2500 మంది పేషెంట్లు వస్తున్నారు. ఇప్పటికే 15 లక్షల మందికి ఓపీ సేవలు అందాయి. మరో 20 మంది ఇన్ పేషెంట్లుగా చేరారు. అలాగే 12 వేల మందికి ఎమర్జెన్సీ సర్వీసులు అందించారు. ఇక్కడి కాలేజీలో 600 మంది విద్యార్థులు, 100 మంది పీజీ కోర్సుల్లో చదువుకుంటున్నారు. ఈ సంవత్సరం పారా మెడికల్ కోర్సులు కూడా రానున్నాయి.

ఏపీ రాజకీయాల్లో మంగళగిరి మొదటి నుంచి హాట్ టాపిక్ గానే ఉంది. ఇప్పుడు ఎయిమ్స్ ప్రారంభంతో మరోసారి ఇది వార్తల్లో నిలవనుంది. ఇది అమరావతికి దగ్గర్లోనే ఉండటంతో టీడీపీ, బీజేపీ మంగళగిరిపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. ఐతే, ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలవడంతో, మరోసారి తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.