Reliance Jio Bring New Prepaid Recharge Plan

కొత్త ప్లాన్ తెచ్చిన రిలయన్స్ జియో.. అదిరిపోయే ఆఫర్

Jio Plan: ఇండియా రిపబ్లిక్ డే సందర్భంగా.. రిలయన్స్ జియో సంస్థ.. తన కస్టమర్ల కోసం రిపబ్లిక్ డే ఆఫర్ ప్లాన్ తెచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రిలయన్స్ జియో సంస్థ పరిస్థితులకు తగినట్లుగా.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తెస్తోంది. తాజాగా భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తెచ్చింది. ఇది 1 సంవత్సరం ప్లాన్. ప్లాన్ విలువ రూ.2999. ఇది 365 వ్యాలిడిటీ కలిగివుంది.

ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజూ 2.5GB డేటాను పొందుతారు. మొత్తం డేటా 912.5GB ఇస్తున్నారు. దీనితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజూ 100 SMSలు చేసుకోవచ్చు.

ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

ఈ ఆఫర్ ద్వారా 2 స్విగ్గీ కూపన్లు పొందవచ్చు. రూ.299ల ఆర్డర్‌పై రూ.125 ఆఫర్ ఉంటుంది. అలాగే Ixigo నుంచి విమాన టికెట్లపై రూ.1500 దాకా ఆఫర్ ఉంది. 1 ప్యాసింజర్‌కి రూ.500, 2 ప్యాసింజర్లకు రూ.1000, 3 ప్యాసింజర్లకు రూ.1500 ఆఫర్ ఇస్తారు. అలాగే Ajio నుచి రూ.2499ల ఆర్డర్‌పై ఫ్లాట్ రూ.500 ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ గుర్తించిన ప్రొడక్టులపై మాత్రమే ఉంటుంది. ఇంకా Tira నుంచి రూ.999 కొనుగోళ్లకు, ఎంపిక చేసిన ఉత్పత్తులపై 30 శాతం ఆఫర్ ఉంది. మాగ్జిమం డిస్కౌంట్ రూ.1000 ఉంది. రిలయన్స్ డిజిటల్ నుంచి ఎంపికచేసిన ఉత్పత్తులపై మినిమం రూ.5000 కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ ఉంది. మాగ్జిమం డిస్కౌంట్ రూ.10000గా ఉంది.

ఈ ప్లాన్‌లో నెట్ డేటా మొత్తం వాడేసుకున్న తర్వాత 64 Kbps అన్‌లిమిటెడ్‌గా వస్తుంది. అలాగే అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా లభిస్తుంది. జియో సినిమా సబ్‌స్క్రిప్షన్‌లో జియో సినిమా ప్రీమియం లేదు.