Chanakya Niti Important To Know Answers Of Five Questions

Contents

Chanakya Niti Important To Know Answers Of Five Questions: సక్సెస్ అవ్వాలంటే ఈ 5 ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి!

Chanakya Niti Important To Know Answers Of Five Questions:మౌర్యుల పరిపాలనా కాలంలో..చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా, రాజనీతిజ్ఞుడిగా, ఆర్థికవేత్తగా, భారత తత్వవేత్తగా గుర్తింపు పొందిన చాణక్యుడినే.. కౌటిల్యుడు అని కూడా అంటారు. నంద వంశాన్ని నాశనం చేసి .. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన రాజనీతిజ్ఞుడు చాణక్యుడు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, జీవితం అనే అంశాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు. వీటిని ఇప్పటికీ సువర్ణాక్షరాలుగా భావిస్తారు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలోని నాల్గవ అధ్యాయంలోని 18వ శ్లోకంలో.. సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో తెలియజేశాడు. చాలా మంది పురుషులు, మహిళలు ఈ విషయాలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురవుతున్నారు. చాణక్య విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు వివాదాలు, ఆర్థిక నష్టాలను నివారించవచ్చు.

మౌర్యుల పరిపాలనా కాలంలో..చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా, రాజనీతిజ్ఞుడిగా, ఆర్థికవేత్తగా, భారత తత్వవేత్తగా గుర్తింపు పొందిన చాణక్యుడినే.. కౌటిల్యుడు అని కూడా అంటారు. నంద వంశాన్ని నాశనం చేసి .. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన రాజనీతిజ్ఞుడు చాణక్యుడు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, జీవితం అనే అంశాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు. వీటిని ఇప్పటికీ సువర్ణాక్షరాలుగా భావిస్తారు.

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలోని నాల్గవ అధ్యాయంలోని 18వ శ్లోకంలో.. సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో తెలియజేశాడు. చాలా మంది పురుషులు, మహిళలు ఈ విషయాలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురవుతున్నారు. చాణక్య విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు వివాదాలు, ఆర్థిక నష్టాలను నివారించవచ్చు. విజయం సాధించాలంటే 5 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని చాణక్యుడు ఈ శ్లోకంలో చెప్పాడు.

చాణక్యుడు చెప్పిన ఆ శ్లోకం అర్థం ఏంటంటే..జ్ఞానవంతుడు ఎప్పుడూ కూడా.. నా సమయం ఎలా ఉంది? నాకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? నేను నివసించే స్థలం ఎలా ఉంది? ఆదాయం, ఖర్చు ఎంత? నేను ఎవరు ? నా శక్తి ఏమిటి, నేను ఏమి చేయగలను?అనేది ఆలోచించాలి. విజయవంతం కావాలంటే ఈ 5 విషయాలు తెలుసుకోవడం ముఖ్యం అని చాణక్యుడు చెప్పాడు.

IIT Madras Recruitment 2024 – Apply for 41 Superintending Engineer Posts

Chanakya Niti Important To Know Answers Of Five Questions

Chanakya Niti Important Questions-1

1.సమయం గురించి 

ప్రస్తుత కాలం ఎలా గడుస్తుందో తెలివైన వ్యక్తికి తెలుసునని చాణక్యుడు చెప్పాడు. ఈ రోజులు సంతోషమా లేక విచారమా? దీని ఆధారంగానే పనిచేస్తుంటారు. ఉదాహరణకు, ఒక వ్యాపారి మార్కెట్ పరిస్థితి ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం.

Chanakya Niti Important Questions-2

2. స్నేహితుల గురించి 

తెలివైన వ్యక్తికి తన నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది. మిత్రుల వేషధారణలో ఉన్న శత్రువులు కూడా అతనికి తెలుసతుంది. నిజమైన మిత్రుడెవరో, మిత్రుడి వేషధారణలో ఉన్న శత్రువు ఎవరో తెలియకపోతే ఏదో ఒకరోజు నమ్మకద్రోహానికి గురవుతారు.

Chanakya Niti Important Questions-3

3. దేశం ఎలా ఉంది? 

ఈ దేశం ఎలా ఉంది అంటే మనం పనిచేసే లేదా ఉండే ఊరు,అక్కడి మనుషులు ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవడం ముఖ్యం. మీరు దీన్ని దృష్టిలో ఉంచుకుని పని చేస్తే, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు, ఎప్పటికీ ఇబ్బందుల్లో పడరు.

Chanakya Niti Important Questions-4

4. ఆదాయం, ఖర్చుల గురించి సమాచారం

మీ ఆదాయం, ఖర్చుల గురించి సమాచారాన్ని కలిగి ఉండటం ముఖ్యం. దీని గురించి అవగాహన లేకుంటే ఇబ్బందే. ఒక వ్యక్తి తన ఆదాయాన్ని బట్టి ఖర్చు చేయాలి. మీరు మీ ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేస్తే, మీరు కొంచెం డబ్బు ఆదా చేయవచ్చు.

Chanakya Niti Important Questions-5

5. మీరు మీ సామర్థ్యాన్ని తెలుసుకోవాలి 

అంతిమంగా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన సామర్థ్యాలను మనం తెలుసుకోవాలి. పూర్తి చేయగలిగే పని మాత్రమే చేపట్టాలి. మీరు మీ సామర్థ్యం కంటే ఎక్కువ పనిని తీసుకుంటే, అప్పుడు వైఫల్యం ఖాయం.