RGUKT AP IIIT Admissions 2024

Contents

RGUKT AP IIIT Admissions 2024 – ఏపీ ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలు.. RGUKT-AP అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల

RGUKT AP IIIT Admissions 2024 ఆంధ్రప్రదేశ్‌లో రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) నిర్వహిస్తున్న నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు- ఆర్కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు) 2024-25 విద్యా సంవత్సరానికి గాను పీయూసీ-బీటెక్‌ (రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్) ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వచ్చేసింది. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈసారి వర్సిటీ అధికారులు వీలైనంత త్వరగా AP IIITప్రవేశాల ప్రక్రియను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత వీలైనంత వేగంగా ప్రవేశాల ప్రక్రియ చేపట్టి జులై నెలలో తరగతులు ప్రారంభమయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ వివరాలను https://www.rgukt.in/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

RGUKT AP IIIT Admissions 2024 Other Details

నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు భర్తీ చేస్తారు.
రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం సీట్లు కేటాయిస్తారు.
మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతో పాటు తెలంగాణ విద్యార్థులు పోటీపడవచ్చు. ఈ సీట్లను తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్‌ మెరిట్‌ కింద కేటాయిస్తారు.

RGUKT AP IIIT Admissions 2024 Education Qualification

గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాసైన విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. అయితే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. సర్కార్ బడుల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్‌ స్కోర్‌ను జోడించి మెరిట్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

RGUKT AP IIIT Admissions 2024 Important Dates

నోటిఫికేషన్ విడుదల తేదీ: మే 6, 2024
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 8, 2024
తరగతుల ప్రారంభం: జులైలో.

RGUKT AP IIIT Admissions 2024 Notification & apply online
Annexure – 1 Click Here
Notification Click Here
Apply Online Click Here

AP EAPCET 2024 Hall Ticket – ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. మే 16 నుంచి పరీక్షలు