SSC CHSL Recruitment 2024

Contents

SSC CHSL Recruitment 2024 – Notification Released For 3712 LDC, DEO And Grade 1 Posts, Apply Online

SSC CHSL Recruitment 2024:ఇంటర్మీడియట్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి సదావకాశం. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2024’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) పరీక్ష నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, ట్రైబ్యునళ్ల తదితర సంస్థల్లో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 2024 కింద దాదాపు 3,712 పోస్టులను ఈ సంవత్సరం భర్తీ చేయనున్నారు. 12వ తరగతి లేదా ఇంటర్‌మీడియట్‌ అర్హత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టుకలు మే 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆగస్టు 01, 2024 నాటికి ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కన్జ్యూమర్‌ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ మినిస్ట్రీ, కల్చర్‌ మినిస్ట్రీ విభాగాల్లో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో తప్పనసరిగా సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

SSC CHSL Recruitment 2024 Age Limits

అభ్యర్ధుల వయసు ఆగస్టు 01, 2024 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్ధులు ఆగస్టు 02, 1997 నుంచి ఆగస్టు 01, 2006 మధ్య జన్మించి ఉండాలన్నమాట. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్ధులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

SSC CHSL Recruitment 2024 Application Fee Details

దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ. 100 చొప్పున చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

SSC CHSL Recruitment 2024 Selection Process

టైర్‌-1, టైర్‌-2 పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఈ రెండు దశల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.

SSC CHSL Recruitment 2024 Salary Details

ఎంపికైన అభ్యర్ధులకు ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900 నుంచి 63,200 వరకు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు రూ.25,500 నుంచి 81,100 వరకు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-ఎ పోస్టులకు రూ.29,200 నుంచి 92,300 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు.

SSC CHSL Recruitment 2024 Important Dates

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ ఏప్రిల్ 08, 2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ మే 07, 2024.
దరఖాస్తు సవరణ తేదీలు మే 10 నుంచి 11 వరకు.
టైర్‌-1(ఆన్‌లైన్‌) పరీక్ష తేదీలు జూన్‌ నుంచి జులై వరకు
టైర్‌-2 (ఆన్‌లైన్‌) పరీక్ష తేదీలు త్వరలో ప్రకటిస్తారు
SSC CHSL Recruitment 2024 Apply Online & Notification Details
Notification Click Here
Apply Online Link Click Here
JMI Civils Free Coaching-JMIలో ఉచిత సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ 2024కు దరఖాస్తులు ఆహ్వానం.. ముఖ్యమైన తేదీలు ఇవే
వీడు తండ్రి కాదు కాలయముడు.. నాలుగేళ్ళ బాలుడికి నరకం చూపించి చంపిన కసాయి..!