JMI UPSC Civil Services 2025 Free Coaching Notification Released

Contents

JMI Civils Free Coaching-JMIలో ఉచిత సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ 2024కు దరఖాస్తులు ఆహ్వానం.. ముఖ్యమైన తేదీలు ఇవే

JMI Civils Free Coaching న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో (సెంట్రల్ యూనివర్సిటీ) రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అకాడమీ, సెంటర్‌ ఫర్‌ కోచింగ్‌ అండ్‌ కెరీర్ ప్లానింగ్‌ 2024-25 విద్యాసంవత్సరానికి గానూ యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ 2024 ప్రిలిమినరీ కమ్‌ మెయిన్స్‌ పరీక్షకు ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్‌ 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా ఉచిత శిక్షణకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఉచిత శిక్షణతోపాటు ఉచిత వసతి సదుపాయం కూడా కల్పిస్తారు. ఉచిత సివిల్‌ సర్వీసెస్‌ 2025 కోచింగ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పినిసరిగా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

JMI Civils Free Coaching Selection process

ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. జూన్‌ 19, 2024వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు అందరూ తప్పనిసరిగా రూ.950 అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఉచిత కోచింగ్‌కు మొత్తం వంద మందిని ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో తనిఖీ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 0091-11-26981717 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు.

JMI Civils Free Coaching Important Dates 

1.ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 19, 2024.
2.అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్‌ తేదీలు: జూన్‌ 21, 22 తేదీల్లో
3.ప్రవేశ పరీక్ష తేదీ: జూన్‌ 29, 2024.
4.ఫలితాల వెల్లడి తేదీ: జులై 20, 2024.
5.ఇంటర్వ్యూ తేదీలు: జులై 28 నుంచి ఆగస్టు 12 వరకు
6.ఫైనల్ రిజల్ట్ తేదీ: ఆగస్ట్‌ 14, 2024.
7.తరగతులు ప్రారంభ తేదీ: ఆగస్ట్‌ 30, 2024.
8.ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

SECR Raipur Recruitment 2024– Apply for 1113 Apprentices Posts

మీరు కొత్త ఏసీ కొనబోతున్నారా? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి