AP EdCET 2024 Notification

Contents

AP EdCET 2024 Notification – ఏపీ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుకు ఎవరు అర్హులంటే!

AP EdCET 2024 Notification: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఎడ్‌సెట్‌ పరీక్షను నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన వారు మే 15, 2024వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

AP EdCET 2024 Notification Details

ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 2024 దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. బీటెక్, బీసీఏ, బీబీఎం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే డిగ్రీ స్థాయిలో తాము చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్టులుగా అభ్యర్ధులు తప్పనిసరిగా ఎంచుకోవాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఎస్సీ/ ఎస్టీలకు చెందిన అభ్యర్ధులు రూ.450, బీసీలకు చెందిన అభ్యర్ధులు రూ.500, ఓసీలకు చెందిన అభ్యర్ధులు రూ.650 చెల్లించాలి. ఎంట్రన్స్‌ టెస్ట్‌లో మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో మాత్రమే ఉంటుంది. రెండు గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.

AP EdCET 2024 Notification Important Dates

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 18, 2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 15, 2024.
రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 19, 2024 వరకు
రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 20, 21 వరకు
దరఖాస్తు సవరణ తేదీలు: మే 22 నుంచి 25, 2024 వరకు
హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ తేదీ: మే 30, 2024.
ఏపీ ఎడ్‌సెట్‌ 2024 ప్రవేశ పరీక్ష తేదీ: జూన్‌ 08, 2024.
ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ విడుదల తేదీ: జూన్‌ 15, 2024.

AP EdCET 2024 Notification Download Below Link

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

RPF Recruitment 2024 – Apply for 4208 Constable Posts

షుగర్‌ పేషెంట్స్‌ మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..