TS Intermediate Results 2024

Contents

TS Intermediate Results 2024 – తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..

TS Intermediate Results 2024 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తోన్న ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితియ సంవత్సర విద్యార్ధుల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. మరికాసేపట్లో ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం (ఏప్రిల్‌ 24) ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ రోజు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా చేతుల మీదగా ఫలితాలు విడుదల చేయనున్నారు.

TS Intermediate Results 2024 Details

కాగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచే మూల్యాంకన ప్రక్రియ కూడా ప్రారంభించారు. ఈ నెల 10తో మూల్యాంకనం ముగియడంతో ఆ తర్వాత ఫలితాల డీకోడింగ్‌ ప్రక్రియను కూడా పూర్తి చేసిన అధికారులు నేడు నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు.

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం, ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌ ఫలితాలను విడివిడిగా వెల్లడించనున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు పదోతరగతి ఫలితాలను కూడా ఇదే నెలలో ప్రకటించేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. మే 30వ తేదీన ఫలితాలు విడుదల చేయనుంది.

TS Intermediate Results 2024 Direct download link Click Here

TS Intermediate Results 2024 Download Below Links

TS INTER 1ST YEAR-2ND YEAR RESULTS 2024 manabadi DIRECT LINK Click Here
TS INTER 1ST YEAR-2ND YEAR RESULTS 2024 ts bie gov in DIRECT LINK 1 Click Here
TS INTER 1ST YEAR 2ND YEAR RESULTS 2024 sakshi DIRECT LINK 4 Click Here
TS INTER 1ST YEAR-2ND YEAR RESULTS 2024 eenadu DIRECT LINK Click Here

RPF Recruitment 2024 – Apply for 4208 Constable Posts

షుగర్‌ పేషెంట్స్‌ మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..