UPSC Civil Services 2023 Results More Than 50 Candidates Are Ranked In UPSC Civil Services From AP And TG

Contents

UPSC Civil Services 2023 Results: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. 50 మందికిపైగా ర్యాంకులు!

UPSC Civil Services 2023 Results More Than 50 Candidates Are Ranked In UPSC Civil Services From AP And TG సివిల్స్‌లో ర్యాంకు సాధించడమనేది ఎందరో యువత కల. తాజాగా ప్రకటించిన యూసీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు 36 మంది ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించారు. వంద లోపు ర్యాంకుల్లో ముగ్గురు తెలుగువాళ్లు ఉన్నారు. నందాల సాయి కిరణ్‌ 27వ ర్యాంకు, కేఎన్‌ చందన జాహ్నవి 50వ ర్యాంకు, మెరుగు కౌశిక్‌ 82వ ర్యాంకు సాధించారు.

UPSC Civil Services 2023 Results Details

ఇతర కేంద్ర సర్వీసులకు 20 మందికిపైగా ఎంపికయ్యారు. ఈ సారి మొత్తమ్మీద కేంద్ర సర్వీసులకు 56 మందికిపైగా తెలుగు తేజాలు ఎంపికవడం గమనార్హం. అఖిల భారత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ సివిల్స్‌ 2023 కోసం గత ఏడాది మే 28న ప్రిలిమ్స్‌, నవంబర్‌లో మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష ఫలితాలను డిసెంబర్‌ 8న వెల్లడించారు. మెయిన్స్‌లోనూ అర్హత పొందిన వారికి జనవరి 2 నుంచి ఏప్రిల్‌ 9 మధ్య ఇంటర్వ్యూలు నిర్వహించారు. యూపీఎస్సీ మంగళవారం ప్రకటించగా.. ఆలిండియా టాపర్‌గా లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాత్సవ టాప్‌ ర్యాంక్‌, ఒడిశాకు చెందిన అనిమేష్‌ ప్రదాన్‌ రెండో ర్యాంక్‌, తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన కొలనుపాక సహన మొదటి ప్రయత్నంలోనే 739వ ర్యాంకు సాధించింది. సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన బుద్ది అఖిల్‌యాదవ్‌ సివిల్స్‌ ఫలితాల్లో 321వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. 2021లోనూ తొలి ప్రయత్నంలోనే 566 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు సెలక్ట్‌ అయ్యాడు. ఐపీఎస్‌ శిక్షణ పొంది ప్రస్తుతం ఢిల్లీలో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేరై ఈసారి ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు.

1,016 మంది ఎంపిక ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ ఏకు 613 మంది, గ్రూప్‌ బీకు 113 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థుల మార్కుల వివరాలను 15 రోజుల్లో యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతామని అధికారులు ప్రకటించారు. తెలంగాణ, ఏపీ నుంచి ఈసారి 50 మందికి పైగా ఎంపికవడం పట్ల ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.

AP INTER RESULTS 2024 SHORT MEMOS DOWNLOAD – GENERAL AND VOCATIONAL MEMOS DOWNLOAD

Banana Benifits: పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?