UPSC CSE Result 2023

UPSC CSE Result 2023 – టాప్‌లో ఆదిత్య, మూడో స్థానంలో అనన్యరెడ్డి.. యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు విడుదల

UPSC CSE Result 2023 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ( UPSC CSE 2024 ) తుది ఫలితాలను విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మంగళవారం ఫలితాలను ప్రకటించింది. సివిల్స్ లో మొత్తం 1016 మంది పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. కాగా.. సివిల్స్ లో ఆదిత్య శ్రీవాత్సవ మొదటి ర్యాంక్ టాప్ లో నిలిచారు. అనిమేష్‌ ప్రధాన్‌కు రెండో ర్యాంక్‌.. దోనూరు అనన్యరెడ్డికి మూడో ర్యాంక్‌ సాధించారు.. 180మంది ఐఏఎస్, 200మంది ఐపీఎస్‌, 37మంది ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. నంద్యాల సాయికిరణ్‌ 27వ ర్యాంక్‌ సాధించాడు. మొత్తం 1,016 మంది అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని.. వీరందరినీ వివిధ కేంద్ర ప్రభుత్వ సేవలకు సిఫార్సు చేసినట్లు UPSC తెలిపింది. యూపీఎస్సీ ఫలితాలను కమిషన్ వెబ్‌సైట్‌లు, upsc.gov.in, upsconline.nic.inలో తనిఖీ చేయవచ్చు.

సివిల్ సర్వీసెస్ పరీక్షను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), కేంద్రంలోని పలు విభాగాల అధికారులను ఎంపిక చేయడానికి నిర్వహిస్తారు. UPSC ద్వారా నిర్వహించే ఈ పరీక్షలో ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ మూడు దశల్లో ప్రక్రియ కొనసాగుతుంది.. ప్రతి సంవత్సరం ఈ పరీక్షను నిర్వహిస్తారు.

కాగా.. UPSC సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్ష 2023 మే 28న జరిగింది. ప్రిలిమ్స్ రౌండ్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 2023 సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో రెండు షిఫ్టులలో జరిగే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. యూపీఎస్సీ సీఎస్ఈ మెయిన్స్ ఫలితాలు డిసెంబర్ 8న విడుదలయ్యాయి. CSE 2023 ఇంటర్వ్యూలు లేదా వ్యక్తిత్వ పరీక్షలు జనవరి 2, ఏప్రిల్ 9 మధ్య దశలవారీగా జరిగాయి.

UPSC CSE Result 2023 Download Click Here

RPF Constable Recruitment 2024 – Check Vacancy Notice, Apply Online Link Activated