UPSC Recruitment 2024

Contents

UPSC Recruitment 2024 – నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,930 పోస్టులకు నోటిఫికేషన్..

నిరుద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్‌న్యూస్ (UPSC) చెప్పింది. బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరి (GNM) చదివిన వారికి కేంద్ర ప్రభుత్వ కొలువు సాధించే సువర్ణవకాశం వచ్చింది. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC)లో నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్‌కు తాజాగా UPSC నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ మార్చి 7 నుంచి ప్రారంభమై 27వ తేదీతో ముగుస్తుంది.

UPSC Recruitment 2024 ఖాళీల వివరాలు

UPSC ESIC రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 1930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. జనరల్ కేటగిరీలో 892 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 193, ఎస్సీ- 235, ఎస్టీ-164, ఓబీసీ కేటగిరీ నుంచి 446 పోస్టులను భర్తీ చేస్తారు.

UPSC Recruitment 2024 వయోపరిమితి

దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమిలో మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి పదేళ్ల సడలింపు ఉంటుంది.

UPSC Recruitment 2024 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్

దరఖాస్తుదారులు బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరి(GNM) పూర్తి చేసి ఉండాలి. అలాగే ఒక సంవత్సరం వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.

MOIL Recruitment 2024– Apply for 44 Graduate Trainee Posts

UPSC Recruitment 2024  దరఖాస్తు ప్రక్రియ

Step-1: ముందుగా UPSC అధికారిక పోర్టల్ https://upsc.gov.in/ ఓపెన్ చేయాలి.

Step-2: హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘What’s New’ అనే కేటగిరీలో ‘ESIC-నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్’ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.

Step-3: ఇక్కడ ‘అప్లైనౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి. ముందుగా పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

Step-4: రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. అన్ని వివరాలతో అప్లికేషన్ నింపి, ఫీజు చెల్లించాలి.

Step-5:  అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, చివరగా అప్లికేషన్ ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.

UPSC Recruitment 2024 అప్లికేషన్ ఫీజు

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

UPSC Recruitment 2024 అప్లికేషన్ కరెక్షన్

అప్లికేషన్ కరెక్షన్ విండో మార్చి 28న ప్రారంభం కానుంది. ఈ గడువు మార్చి 3న ముగుస్తుంది. ఈ సమయంలో అప్లికేషన్‌లో ఏవైనా మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది.

UPSC Recruitment 2024 ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో ఉంటుంది. ముందు ఆన్ లైన్ రాత పరీక్ష జరుగుతుంది. రెండోదశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామ్ షెడ్యూల్‌ను యూపీఎస్సీ త్వరలో ప్రకటిస్తుంది.

UPSC Recruitment 2024 జీతభత్యాలు

ఈఎస్‌ఐసీ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను ఎంపికయ్యే అభ్యర్థుల జీతం నెలకు రూ.42,300 నుంచి రూ.63,300 వరకు ఉంటుంది.