Whatsapp Introduced New Meta AI Feature Check Here For How This Feature Works

Contents

Whatsapp Introduced New Meta AI Feature Check Here For How This Feature Works – వాట్సాప్‌లో వచ్చిన ఈ కొత్త ఫీచర్‌ను గమనించారా.? దీని ఉపయోగం ఏంటంటే..

Whatsapp Introduced New Meta AI Feature Check Here For How This Feature Works:

వాట్సాప్‌.. ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా కనిపించే యాప్స్‌లో ఇదీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్‌ ఏదైనా ఉందంటే అది వాట్సాప్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీకి పెరుగుతోన్న డిమాండ్‌ నేపథ్యంలో మెటా కూడా ఈ దిశగా అడుగులు వేసింది.

Whatsapp Introduced New Meta AI Feature Check Here For How This Feature Works Details

ఇందులో భాగంగానే మెటా ఏఐ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే కొంత మంది యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ చాట్స్‌ ఓపెన్ చేయగానే రౌండ్‌ షేప్‌లో ఒక సింబల్‌ కనిపిస్తోంది. దీంతో ఇది ఏంటా అని చాలా మంచి అనుకుంటున్నారు. ఇంతకీ వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ ఏంటి.? దీని వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మెటా తీసుకొచ్చిన ఈ ఏఐ సెర్చ్‌ టూల్‌ అచ్చంగా చాట్‌ జీపీటీలా పనిచేస్తుంది. రౌండ్‌ సింబల్‌ను క్లిక్ చేయగానే ‘మెటా ఏఐ విత్‌ లామా’ అనే చాట్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఈ అడ్వాన్స్‌డ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో ఏ ప్రశ్న అడిగినా ఇట్టే సమాధానం చెప్తుంది. ఇందులో కొన్ని ప్రశ్నలను అదే సజెస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ చాట్‌ బాట్ కేవలం ఇంగ్లిష్‌లోనే ఉంది. అయితే ఇతర భాషాల్లో కూడా అందిస్తారేమో చూడాలి.

ఇంతకీ మెటా ఏఐతో ఛాట్‌ ఎలా చేయాలంటే. ఇందుకోసం ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయగానే కనిపించే రౌండ్‌ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ను యాక్సెప్ట్‌ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద కనిపించే ప్రాంప్ట్‌ను ఎంచుకోవచ్చు లేదా మీకు వచ్చిన సందేహాన్ని అక్కడ పేస్ట్ చేయవచ్చు. సెండ్‌ బటన్‌ నొక్కగానే ఏఐ మీతో చాట్‌ చేస్తుంది. టెక్ట్స్‌, ఫొటోల రూపంలో మీకు ఏఐ సమాధానం ఇస్తుంది. ఉదాహరణకు ఇమాజిన్‌ కార్‌ రేస్‌ ఆన్‌ మార్స్‌ అనే ప్రశ్నను ఇస్తే.. మార్స్‌పై నిజంగానే కార్‌ రేస్ జరిగితే ఎలా ఉంటుంది అన్న ఫొటోను వెంటనే ఏఐ ఇస్తుంది. ఎడ్యుకేషన్‌ మొదలు హెల్త్‌ వరకు టెక్నాలజీ నుంచి సైన్స్ వరకు అన్ని రకాల ప్రశ్నలకు ఈ మెటా ఏఐలో సమాధానం లభిస్తుంది.

SSC CHSL రిక్రూట్‌మెంట్ 2024 – 3712 LDC, DEO మరియు గ్రేడ్ 1 పోస్టుల కోసం నోటిఫికేషన్
విడుదల చేయబడింది, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

YS Jagan: ఇకపై అలా చేయొద్దు.. దాడి ఘటన తరువాత సీఎం జగన్ భద్రతలో మార్పులు.. కీలక సూచనలు..